ప‌హిల్వాన్ మేకింగ్ వీడియో

Sat,September 7, 2019 08:45 AM
Making of Pehlwaan

ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన క‌న్న‌డ న‌టుడు సుదీప్. ప్ర‌స్తుతం ఈ న‌టుడు ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ప‌హిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్‌ నేతృత్వంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్‌ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప‌లు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా సుదీప్‌ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహాన్‌సింగ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ నుంచి లార్వెన్‌ సోహైల్‌ అనే నిపుణున్ని కూడా పిలిపించారు.

అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగులో ప‌హిల్వాన్ అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులోని స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి పీవీ సింధు, బోయ‌పాటి శీనుతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో చిత్ర మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియో అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles