విభిన్న అవ‌తారాల‌లో ర‌జ‌నీకాంత్ - వీడియో

Sun,November 18, 2018 07:55 AM
Making Video Of 2.0 Presenting The Different Avatars Of Rajini

శంకర్ సృష్టించిన గ్రాఫిక్ మాయాజాలం 2.0 నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్రేక్ష‌కుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేందుకు మేక‌ర్స్ వినూత్న ప్ర‌చారాలు చేస్తున్నారు. ఇటీవ‌ల అక్ష‌య్ మేకొవ‌ర్ వీడియో రిలీజ్ చేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన టీం తాజాగా ర‌జ‌నీకాంత్ రోబోగా ఎలా మారాడో మేకింగ్ వీడియోలో చూపించారు. అంతేకాదు 67 ఏళ్ల ర‌జ‌నీకాంత్ వివిధ గెటప్స్ కూడా ఈ వీడియోలో చూపించారు. ఆరు ప‌దుల వ‌య‌స్సులో త‌లైవా త‌న‌ ఎన‌ర్జీ లెవ‌ల్స్‌తో అంద‌రిని సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తున్నారు. అక్కీ అనే ప్ర‌తినాయ‌క పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ అద‌ర‌గొట్టనుండ‌గా, ర‌జ‌నీకాంత్ శాస్త్రవేత్తగా, రోబోగా ద్విపాత్రాభిన‌యంతో అల‌రించ‌నున్నారు. సుమారు రూ.550 కోట్లతో నిర్మించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రం బాహుబ‌లి రికార్డులని తిర‌గరాయ‌డం ఖాయం అంటున్నారు.

1979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles