విజయ్ సేతుప‌తికి స్వాగ‌తం చెప్పిన మెగా హీరో మూవీ యూనిట్

Sun,April 28, 2019 07:06 AM

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో విభిన్న క‌థా చిత్రాల‌ని ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్న త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి. ఇటీవ‌ల 96, సూప‌ర్ డీల‌క్స్ వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని థ్రిల్ చేసిన విజ‌య్ సేతుప‌తి లాభం అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు తెలుగులో సైరా చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ మూవీలోను విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తుంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేసింది.


సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రీలుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నాడ‌ని తెలుపుతూ ఆయ‌నకి చిత్ర యూనిట్ ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఇందులో విజ‌య్ నెగెటివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు. సైరా నరసింహారెడ్డి తర్వాత ఆయన తెలుగులో నటిస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం. . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

3031
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles