మ‌ల‌యాళంలోను బిగ్ బాస్‌.. హోస్ట్‌గా మెగాస్టార్

Sun,June 3, 2018 12:06 PM

వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన స్టార్స్ ఇప్పుడు బుల్లితెర‌కి ప‌రిచ‌యం అవుతున్నారు. రియాలిటీ షోల‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఆనందింప జేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ . తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా సీజ‌న్ 1 పూర్తి కాగా, సీజ‌న్ 2ని నాని హోస్ట్ చేయ‌నున్నాడు. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక క‌న్న‌డ షోకి సుదీప్ వ్యాఖ్యాత‌గా ఉన్నాడు. ఇక త్వ‌ర‌లో మ‌ల‌యాళంలోను బిగ్ బాస్ మొద‌లు కానుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. హిందీలో మొద‌లైన బిగ్ బాస్ మానియా ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాష‌ల‌కి పాకుతుంది. మ‌ల‌యాళ బిగ్ బాస్ షో జూన్ 24 నుండి ప్రారంభం కానుండ‌గా, ఇందులో 15 మంది సెల‌బ్రిటీలు వంద రోజులు పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండ‌నున్నారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న ఈ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు.



3748
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles