టీజ‌ర్‌లో యుద్ధ‌వీరుడిగా అద‌ర‌గొట్టిన సూప‌ర్ స్టార్

Sat,September 28, 2019 11:35 AM

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఇటీవ‌ల యాత్ర అనే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌మ్ముట్టి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో క‌నిపించి అల‌రించారు. తాజాగా భారీ పీరియ‌డ్ డ్రామా మ‌మాంగం అనే సినిమా చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మమ్ముట్టి కేర‌ళ సంప్రాదాయ యుద్ధ‌వీరుడిగా క‌నిపించ‌నున్నారు. 17వ శ‌తాబ్ధం నాటి క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇద్ద‌రు ద‌ర్శ‌కులు తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ సంజీవ్ పిళ్ళై ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, రెండో షెడ్యూల్ ఎం ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. మామాంగం అనే పండుగ సంద‌ర్బంగా జ‌రిగే వివాదం నేప‌థ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. ఇటీవ‌ల‌ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో యుద్ధ‌వీరుడిగా మ‌మ్ముట్టి లుక్ ఆక‌ట్ట‌కునేలా ఉంది. ప్రాచీ తెహ్లన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‌, అను సితార, మాళవికా మీనన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేప‌టి క్రితం టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మ‌మ్ముట్టి, ఉన్ని ముకుందన్ చేసే క‌త్తి విన్యాసాలు ఆక‌ట్టుకుంటున్నాయి. మీరు టీజ‌ర్‌పై ఓ లుక్కేయండి.


2158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles