అయోధ్య తీర్పుపై స్పందించిన మంచు లక్ష్మీ

Sat,November 9, 2019 01:13 PM

అత్యంత సున్నితమైన అయోధ్య రామజన్మభూమి, బాబ్రి మసీదు భూ వివాదంపై సుప్రీం కోర్టు కొద్ది సేప‌టి క్రితం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగ‌తి తెలిసిందే. అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏకగ్రీవ తీర్పునిచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని ఏకగ్రీవ తీర్పు వెలువరిస్తూ, ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని తుదితీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పుపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. తాజాగా మంచు ల‌క్ష్మీ దీనిపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది. మ‌న‌దేశంలో శాంతి, గౌర‌వం ప్ర‌బ‌లంగా ఉంది. భారతదేశాన్ని ఇతర దేశాల కంటే చాలా అందంగా తీర్చిదిద్దేది మ‌న దేశ వైవిధ్యం మరియు సమగ్రత అని ట్వీట్‌లో పేర్కొంది మంచు వారమ్మాయి.

3240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles