ద‌ట్ట‌మైన అడ‌వుల్లో మ‌ణిర‌త్నం సినిమా షూటింగ్ ప‌నులు మొద‌లు

Fri,November 8, 2019 08:50 AM

మేలిమి ముత్యాల్లాంటి సినిమాల‌ని తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం.. క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా ఆయ‌న‌ సినిమా తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా కొద్ది రోజులుగా ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. కోలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు న‌టించ‌నున్న ఈ ప్రాజెక్ట్ థాయిలాండ్‌లోని దట్టమైన అడవుల్లో వందరోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే చిత్రంలో ముఖ్య‌మైన స‌న్నివేశాల‌కి సంబంధించి థాయ్ ల్యాండ్ అడ‌వుల‌లో సెట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ట‌. డిసెంబ‌ర్ 12 న ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు స‌మాచారం.


ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, మొత్తం 12 పాట‌ల‌ని ఆయ‌న రూపొందిస్తున్నార‌ట‌. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ క్లాసిక్ స్టైల్‌లో ట్యూన్స్ సిద్దం చేస్తున్న‌ట్టు టాక్. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు స్టార్స్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles