మ‌ణిక‌ర్ణిక‌కి మొద‌లైన స‌మ‌స్య‌లు..!

Tue,February 6, 2018 12:44 PM
MANIKARNIKA movie in controversy

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. ఝాన్సీ లక్ష్మీబాయి కథతో మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం కంగనా కత్తి యుద్ధాలలో శిక్షణ పొందింది. నటిగా ఇదే తన చివరి సినిమా కావడంతో ఈ మూవీపై చాలా కాన్సన్ ట్రేషన్ చేయ‌డంతో పాటు ఫుల్ హార్డ్ వ‌ర్క్ చేస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ స‌మయంలో ఓ సారి గాయ‌ప‌డింది కూడా. అయితే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రం ఇప్పుడు వివాదంలో చిక్కుకున్న‌ట్టు తెలుస్తుంది. మ‌ణిక‌ర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్‌ చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సర్వ బ్రాహ్మణ మహా సభ అధ్యక్షుడు సురేష్ మిశ్రా రాజస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. జై మిశ్రా రాసిన వివాదాస్ప‌ద పుస్తకం రాణీ ఆధారంగా మ‌ణిక‌ర్ణిక తెర‌కెక్కిస్తున్నార‌నే అనుమానం క‌లుగుతుంది . ఝాన్సీ ల‌క్ష్మీ బాయ్‌కి, బ్రిటీష్ వ్య‌క్తికి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు తీసి చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రిస్తే అస్సలు ఊరుకునేదే లేదంటూ స‌ర్వ బ్రాహ్మ‌ణ మ‌హాస‌భ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. బాహుబ‌లి ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి క‌థ అందిస్తుండ‌గా, మూవీని ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉంటే సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్ చిత్రం కూడా వివాదాల మ‌ధ్యే తెర‌కెక్కి విడుద‌లైంది. చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించార‌ని కర్ణిసేన‌, రాజ్‌పుత్‌లు సినిమాకి అడ్డుప‌డ‌గా, మూవీ రిలీజ్ త‌ర్వాత ప‌ద్మావ‌త్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు.

1987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles