ప్యాక‌ప్ చెప్పిన మ‌ణిక‌ర్ణిక టీమ్‌

Fri,March 30, 2018 10:24 AM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయి కథతో క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ. ఈ చిత్రం కోసం కంగనా కత్తి యుద్ధాలలో శిక్షణ పొందింది. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణిలాంటి చారిత్రాత్మ‌క చిత్రం త‌ర్వాత క్రిష్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ జోథ్‌పూర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. గురువారంతో చిత్రీక‌ర‌ణ పూర్తైంది. శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఏప్రిల్‌లో మూవీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల మణికర్ణిక సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ చరిత్రను వక్రీకరించారంటూ సర్వ బ్రాహ్మణ మహాసభ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందించిన కంగానా.. ఝాన్సీ లక్ష్మీ బాయ్ కి, బ్రిటీష్ వ్యక్తికి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపించడానికి మేం తీసేది ప్రేమ కథకాదు చరిత్ర. భారతీయ మహిళలందరు గర్వించేలా తీస్తున్న ఈ మూవీ పై కొందరు ప్రచారం కోసమే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. అసలు వీరనారిపై ఇలాంటి విమర్శలేంటి. శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆమె చూపిన వీరపరాక్రమం గురించి సినిమాలో చూపిస్తున్నాం అని తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ త‌ర్వాత కంగ‌నా ప్ర‌కాశ్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో మెంట‌ల్ హై క్యా అనే సినిమా చేయ‌నుంది. 2014లో వచ్చిన ‘క్వీన్‌’ మూవీలో రాజ్‌కుమార్‌రావ్‌తో క‌లిసి న‌టించిన కంగనా, మ‌ళ్ళీ నాలుగేళ్ల తర్వాత మెంట‌ల్ హై క్యా సినిమా కోసం క‌లిసి ప‌ని చేస్తున్నారు.

2882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles