మెగా హీరో సినిమాకి ప‌వ‌ర్‌పుల్ టైటిల్‌ ..!

Fri,December 15, 2017 11:03 AM
mass title for sai dharam tej movie

మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. స‌క్సెస్ ప‌ర్సంటేజ్ కాస్త త‌క్కువ‌గా ఉన్నా, ఆఫ‌ర్స్ మాత్రం క్యూ క‌డుతున్నాయి. వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న తేజూ, తొలిప్రేమ డైరెక్ట‌ర్ క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేస్తున్నాడు. అయితే వివి వినాయ‌క్ సినిమాతో తేజూకి త‌ప్ప‌క హిట్ ఇస్తుంద‌ని మెగా ఫ్యాన్స్ భావిస్తుండ‌గా,ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. గ‌తంలో ఈ చిత్రానికి ఇంటిలిజెంట్, దుర్గ‌ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు రాగా, తాజాగా ధ‌ర్మా బాయ్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ టైటిల్‌ని బ‌ట్టి చూస్తుంటే ఇదొక ప‌క్కా మాస్‌, యాక్ష‌న్ మూవీ అని అర్ధ‌మ‌వుతుంది. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రానికి కథను అందించ‌గా, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తేజూ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయికగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఈ చిత్రంలో తేజూ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తుండ‌గా, దీనిపై క్లారిటీ రావ‌లసి ఉంది.

1825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles