ఆరు రోజుల్లో 56 కోట్లు కొల్ల‌గొట్టిన ఇస్మార్ట్ శంక‌ర్

Wed,July 24, 2019 10:25 AM
Massive 56 Crores Gross for ismart sankar

బాక్సాఫీస్ వ‌ద్ద ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతూనే ఉంది. జూలై 18న విడుద‌లైన ఈ చిత్రం స‌రిగ్గా ఆరు రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. వీకెండ్‌లోనే కాదు మాములు రోజుల‌లోను ఈ చిత్రంకి ప్రేక్ష‌కాద‌ర‌ణ మ‌రింత పెరుగుతూ పోతుంది. కొన్ని చోట్ల ఇప్ప‌టికి హౌజ్‌ఫుల్ బోర్డ్స్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. పూరీ మ్యాజిక్, రామ్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. చూసిన వారే మ‌ళ్ళీ మ‌ళ్ళీ థియేట‌ర్స్‌కి వెళుతుండ‌డం విశేషం. చాలా రోజుల త‌ర్వాత మాంచి మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో దీనిని ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. అయితే జూలై 26న డియ‌ర్ కామ్రేడ్ చిత్రం విడుద‌ల కానుండ‌డంతో ఇస్మార్ట్ శంక‌ర్ వ‌సూళ్ళ‌కి కాస్త బ్రేక్ ప‌డుతుందేమోన‌ని అంటున్నారు. చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించగా పూరీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిధి అగర్వాల్,నభా నటేష్ ప్రధాన హీరో హీరోయిన్లుగా నటించారు.

2003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles