'మ‌త్తు వ‌ద‌ల‌రా' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ఎన్టీఆర్

Wed,October 23, 2019 11:16 AM

టాలీవుడ్‌లో మంచి చిత్రాల‌ని నిర్మిస్తూ వ‌స్తున్న మైత్రి మూవీ మేక‌ర్స్ .. క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి మ‌త్తు వ‌ద‌ల‌రా అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం చిత్ర ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తో పాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ ఉంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంది. రితేష్ రానా డైరెక్టర్‌‌గా ఇంట్రడ్యూస్ అవుతుండగా.. ‘దండాలయ్యా’, ‘పెనిమిటి’ పాటలతో అలరించిన కాల భైరవ ఈ చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నాడు. కంటెంట్ డ్రైవన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు.


సమయం ఎలా గడిచిపోతుందో తెలియ‌డం లేదు. నా సోదరులంతా పెరిగిపోయారు. సింహా కోడూరి హీరోగా, భైరి సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మత్తు వదలరా' చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. తొలి చిత్రాలతోనే వీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర టీమ్ కు శుభాకాంక్షలు" అని ఎన్టీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. పోస్ట‌ర్‌లో శ్రీ సింహా కోడూరి ప‌డుకొని ఉన్నాడు. ప‌లు పేప‌ర్ క‌టింగ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల అయ్యే సరికి సినిమాపై అంచ‌నాలు పెరిగాయి . న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో యూత్ ఎదుర్కొంటున్న ఓ చిత్రమైన సమస్యను ప్రస్తావించనున్నట్లు చిత్రయూనిట్ చెబుతుంది.
2671
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles