కోలీవుడ్‌లోను మీటూ క‌మిటీ

Sun,April 21, 2019 10:17 AM
Me Too Committee formed in tamil industry

టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా,టివి పరిశ్రమలో మహిళా ఆర్టిస్టుల మీద లైంగిక వేధింపులపై 25 మందితో కమిటీని నియమించిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెక్సువల్ హెరాస్‌‌మెంట్ కమిటీలో టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులను ప్రతినిధులుగా చేర్చారు. సినీ నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలను ఈ కమిటీలో కీలక సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. కేవలం ఇండస్ట్రీకి సంబంధించిన వారే కాకుండా.. నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మిలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్ మొత్తానికి తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న రామ్ మోహన్ రావు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇక కోలీవుడ్‌లోను మీటూ క‌మిటీ ఏర్పాటైంది.

కోలీవుడ్‌లోను లైంగిక వేధింపులు, మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు ఎక్క‌వ కావ‌డంతో ద‌క్షిణ భార‌త న‌టీన‌టుల సంఘం( న‌డిఘ‌ర్ సంఘం) మీటూ పేరుతో ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నాజర్‌ అధ్యక్షుడిగా వ్వవహరిస్తారు. కమిటీ సభ్యులుగా విశాల్, కార్తీ, పూచీ మురుగన్‌ నటీమణులు కుష్బు, రోహిణి, సుహాసినిలతో పాటు ఒక సామాజికవేత్త, న్యాయవాది అంటూ 8 మందిని నియమించారు. ఇండస్ట్రీలో జరిగే చీకటి బాగోతాలను బయటపెట్టి.. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని పడకసుఖం కోరుకునే వారిని గుట్టును బయటపెట్టడమే ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ఇకపై ఇండస్ట్రీలో ఎవరిపై వేధింపులు జరిగినా ఈ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. పరిశ్రమలో లైంగిక వేధింపుల‌కి పాల్పడిన వారిని ఈ కమిటీ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది.

844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles