ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది

Sat,December 3, 2016 09:52 AM

అదివరకు ఏదైనా విపరీతం జరిగితే అంతా కాలమహిమ అని, విధి వైపరీత్యం అని అనేవాళ్లు. ఇప్పుడు నోట్ల మహిమ అంటున్నారు. నిజమే. టాలీవుడ్ రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంతా అంతా కాదు. కోట్లాది రూపాయల వ్యాపారాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. షూటింగ్స్ ఆగిపోయాయి. ప్రొడ్యూసర్లు పేమెంట్స్ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల రిలీజ్ కాని సినిమాల జాబితాలో మీలో ఎవరు కోటీశ్వరుడు కూడా వుంది. కొన్నాళ్ళనుండి ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా నిర్మాతలు ఈ చిత్ర విడుదలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవీన్ చంద్ర, శ్రుతి సోధి, పృథ్వీ, సలోని ముఖ్యపాత్రలను పోషించిన ఈ సినిమాను ఈ నెల 23న విడుదల చేస్తామని నిర్మాత రాధామోహన్ చెప్పాడు. ఒక కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతోంది.

2122
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles