ఇందులో హీరో ఎవరో మరి?

Tue,October 4, 2016 09:48 AM

నవీన్ చంద్ర, శృతి సోధి, సలోని, పృధ్వీ ప్రధాన పాత్రలలో ఈ సత్తిబాబు తెరకెక్కించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంకు సంబంధించి తాజాగా చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ని చూశాక ఆడియన్స్ లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో హీరో నవీన్ చంద్రనా లేదంటే పృధ్వీనా..అనే డౌట్ అందరి మనసులను తొలుస్తోంది. ట్రైలర్ లో పృధ్వీనే హైలైట్ చేస్తూ, నవీన్ చంద్రని నామమాత్రంగా చూపించారు. మధ్యలో హీరో నువ్వా నేనా అంటూ ఓ కార్డు వేసి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఇక చివరిగా పృధ్వీ నా ప్రేమ వెన్నలా కరిగిపోయేది కాదు.. పాలలా విరిగిపోయేది కాదు.. మజ్జిగలా పులిసిపోయేది కాదంటూ ఫన్నీ డైలాగ్ పేల్చి సినిమా అంతా తన చుట్టూ సాగుతుందనే ఉద్ధేశాన్ని చాటాడు. మరి ఒకసారి మీరు ఆ ట్రైలర్ ని చూసి మీ ఉద్దేశాన్ని చెప్పండి


2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles