బుల్లి తెరపై మెగా ఎంట్రీ ఈ రోజే

Mon,February 13, 2017 07:47 AM

149 సినిమాలతో వెండితెరపై అలరించి అశేష ప్రేక్షకాదరణను పొంది అభిమానులలో గుండెల్లో మెగాస్టార్ గా నిలిచిపోయిన చిరంజీవి ఈ మధ్య తన 150వ చిత్రం ఖైదీ నెం 150తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం మెగాస్టార్ కి కావలసినంత బూస్టప్ ఇచ్చింది. ఇక కొన్నాళ్ళ నుండి చిరు బుల్లితెరపై కూడా సందడి చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో మూడు సిరీస్ లకి హోస్ట్ వ్యవహరించిన నాగార్జున ఇప్పుడు ఆ బాధ్యతలను చిరుకి అప్పజెప్పగా, ప్రస్తుతం ఆ షోస్ కి సంబంధించిన కార్యక్రమాలన్ని పూర్తయ్యాయి. ఈ రోజు రాత్రి 9.30గంలకు మెగా సెలబ్రేషన్స్ బిగిన్ కానున్నాయి.


వెండితెరపై ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన మెగాస్టార్ బుల్లి తెరపై కూడా సంచలనాలు క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ హోస్ట్ చేస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో నాలుగో సీజన్ కాగా, ఇందులో 60 ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. వారానికి నాలుగు ఎపిసోడ్లు ప్రసారం చేయనుండగా.. మొత్తం పదిహేను వారాలపాటు బుల్లితెరపై సందడి చేయనున్నారు చిరంజీవి. మొదటి షోకి గెస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు షోని గతంలో హోస్ట్ చేసిన నాగ్ వస్తారని ఇప్పటికే తెలియజేయగా వెంకీ, బాలకృష్ణలు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయనున్నట్టు సమాచారం. మరి వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ ని కుమ్మేసిన మెగాస్టార్ ఈ రోజు నుండి బుల్లితెరపై ప్రసారం కానున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంతో ఛానెల్ టీఆర్పీ రేటింగ్ ని ఏ రేంజ్ కి తీసుకువెళతాడో చూడాలి.

1777
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles