ఆ ఇద్దరు మెగా హీరోలని గుర్తు పట్టారా..!

Wed,July 25, 2018 04:30 PM
mega heroes in new getup

చిరంజీవి అడుగు జాడలలో వెళుతున్న మెగా హీరోలందరు మంచి సక్సెస్ రేటుతో ముందుకెళుతున్నారు. కుర్రహీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించేందుకు చాలా కష్టపడుతున్నారు. మొదట్లో మంచి హిట్స్ కొట్టిన సాయి ధరమ్ ప్రస్తుతం ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతుండగా, వరుణ్ తేజ్ స్లో అండ్ స్టడీగా మంచి విజయాలతో దూసుకెళుతున్నాడు. అయితే ఈ ఇద్దరు హీరోలు తాజాగా మాస్క్ లు వేసుకొని ఫోటోలకి ఫోజులిచ్చారు. సాయిధరమ్ తేజ్ జోకర్ మాస్క్ ధరించగా, వరుణ్ తేజ్ ట్రంప్ మాస్క్ లో కనిపించి అలరించారు. ఈ ఫోటోని వరుణ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ట్రంప్ను కలిసిన జోకర్` అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫోటో మెగా అభిమానులని ఆకట్టుకుంటుంది. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్ తేజ్ , సాయిధరమ్ లు త్వరలో వారి వారి ప్రాజెక్టులతో బిజీ కానున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘చిత్రలహరి’ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ కసరత్తులు చేస్తుండగా, వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పేస్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఎఫ్ 2 అనే మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్నాడు.

4498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles