మెగా నందమూరి ప్రాజెక్ట్ కి బ్రేక్ పడ్డట్టేనా ?

Thu,November 16, 2017 11:56 AM

మెగా హీరో సాయిధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరిగింది. కె.ఎస్. రామారావు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘రామకృష్ణ’ లేదా స్టార్ అనే టైటిల్ ని ఫిక్స్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు గతంలో కొన్ని సామాజిక మాధ్యమాలు ప్రచురించాయి. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన త్రిష నటించనుండగా, సాయిధరమ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించనుందని అన్నారు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి కాగా, త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని అన్నారు. కాని కట్ చేస్తే ఈ చిత్ర కథ పూర్తి కాలేదట. దర్శకుడి కథనంలో తేడా రావడంతో కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడట. సాయి ధరమ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడంతో ఈ సినిమా ఆగినట్టే అంటున్నారు ఫిలింనగర్ జనాలు. మరి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

1816
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles