హాలీవుడ్ రేంజ్‌లో అనుష్క 'సైలెన్స్‌'

Sun,March 17, 2019 07:22 AM
michael madsen acts in anushka movie

అనుష్క‌, మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నున్న చిత్రం సైలెన్స్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పొరేష‌న్ సంస్థ‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో నిర్మిస్తున్న నేప‌థ్యంలో టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్‌ని ఎంపిక చేస్తున్నారు. తాజాగా కిల్ బుల్ ఫేం మేఖేల్ మ్యాడ‌స‌న్‌ని ఈ చిత్రానికి ఎంపిక చేసిన‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. దాదాపు 100కి పైగా సినిమాల‌లో న‌టించిన మైఖేల్ తొలిసారి ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సుబ్బ‌రాజు, అంజ‌లి , షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించ‌నున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ యూఎస్ఏలోని సీయోట‌ల్‌లో జ‌ర‌గ‌నుంద‌ట‌. జూన్ వ‌ర‌కు అక్క‌డే చిత్ర షూటింగ్‌ని జ‌రిపి, మేలో టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తామ‌ని అంటున్నారు. గోపిసుంద‌ర్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్ష‌కులందరిని ఎంటర్‌టైన్ చేస్తుంద‌ని అంటున్నారు.1887
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles