150 కోట్ల క్లబ్‌లో మిషన్ మంగళ్

Mon,August 26, 2019 02:32 PM
mission mangal entered in 150 crores club

ముంబై: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన అక్షయ్ కుమార్ సినిమా మిషన్ మంగళ్ 11రోజుల్లోనే 150కోట్ల క్లబ్‌లో చేరి, విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 11రోజుల్లోనే 150కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ రెండో సినిమాగా మిషన్ మంగళ్ నిలిచింది. మొదటి సినిమా రజినీకాంత్‌తో చేసిన 2.0 పది రోజుల్లోనే ఈ మార్క్ అందుకుంది. ఇండియా మొత్తంగా ఈ సినిమా ఇప్పటి వరకు రూ.164కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో అక్షయ్‌తో పాటు విద్యాబాలన్, సోనాక్షి సిన్హ, తాప్సీ, కృతి కుల్హరీ, నిత్యామీనన్ నటించారు.
తరణ్ ఆదర్శ్ బాక్సాఫీస్ రిపోర్టు ఇక్కడ చూడవచ్చు.

991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles