సాహోకి పోటీగా మిష‌న్ మంగ‌ల్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Fri,July 5, 2019 09:56 AM

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ వ‌రుస ప్రాజెక్టుల‌తో ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిక అగర్వాల్ పాత్రలో తాప్సీ కనిపించనుంది. జగన్‌ శక్తి ఈ చిత్రానికి దర్శకుడు. గ‌త ఏడాది నవంబ‌ర్‌లో చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, రీసెంట్‌గా పూర్తైన‌ట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.ఇందులో అక్ష‌య్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. స్పేస్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం కూడా అభిమానుల అంచ‌నాల‌కి మించేలా ఉంటుంద‌ని అంటున్నారు. కాగా, సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న స్పై థ్రిల్ల‌ర్ సాహో. దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగు, త‌మిళం, హిందీ , మ‌ల‌యాళంతో పాటు ప‌లు భాష‌ల‌లో విడుద‌ల కానుంది. స్వాతంత్య్ర దినోత్స‌వం నాడు సాహో, మిష‌న్ మంగ‌ల్ సినిమాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఆస‌క్తిక‌ర పోటీలో గెలుపెవ‌రిదో చూడాలి.

1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles