మిష‌న్ మంగ‌ళ్ తెలుగు వ‌ర్షెన్ ట్రైల‌ర్ విడుద‌ల‌

Sun,August 4, 2019 06:59 AM

అద్భుత అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల‌తో ఇస్రో త‌న ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాపింప చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మార్స్ గ్ర‌హం మీద‌కు కూడా భార‌త్‌కు చెందిన అంత‌రిక్ష సంస్థ ఇస్రో ఉప‌గ్ర‌హాన్ని పంపించింది. ఇస్రో మంగ‌ళ్‌యాన్ మిష‌న్‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌థాంశంతో రూపొందుతున్న చిత్రం మిష‌న్ మంగ‌ళ్ . ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది.ఈ మూవీలో అక్ష‌య్‌కుమార్.. రాకేశ్ ధావ‌న్ శాస్త్ర‌వేత్త పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇక మ‌రో శాస్త్ర‌వేత్త తారా షిండే పాత్ర‌ను విద్యాబాల‌న్ పోషిస్తున్న‌ది. ఈ చిత్రాన్ని డైర‌క్ట‌ర్‌ జ‌గ‌న్ శ‌క్తి తెర‌కెక్కిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న చిత్రం విడుద‌ల కానుంది . ‘ఒక దేశం, ఒక కల, ఒక చరిత్ర.. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్‌ కథ ఆధారంగా రాబోతున్న చిత్రం తెలుగులోను విడుద‌ల కానుంది. తాజాగా తెలుగు వ‌ర్షెన్‌కి సంబంధించిన ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు . మీరు ఆ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేయండి

1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles