శివ ప్ర‌సాద్‌తో త‌న‌కున్న అనుబంధం గుర్తు చేసుకున్న మోహ‌న్ బాబు

Sun,September 22, 2019 12:13 PM

తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శివ ప్ర‌సాద్ శనివారం మధ్యాహ్నం 2.07 ని.లకు క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆయన‌కి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులు అర్పించారు. 25కి పైగా సినిమాల్లో నటించిన శివ ప్ర‌సాద్ పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయ‌న మ‌ర‌ణం త‌న ఆత్మీయుల‌కి తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు. కొద్ది సేప‌టి క్రితం మోహ‌న్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా శివ ప్ర‌సాద్‌కి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. డా. శివ ప్రసాద్ నాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి తెలుసు. 1985 - 90లలో నేను హీరోగా నటించిన భలే రాముడు అనే సినిమాలో ఓ గెస్ట్ వేషంలో నటించాడు. అతను నాకు మంచి మిత్రుడు, నటుడు, నిర్మాత మరియు రాజకీయవేత్త. ఇటీవలే నాతో గాయత్రి లో కూడా యాక్ట్ చేసాడు. ఎప్పుడు పలకరించినా అన్న అన్న అంటు ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. శివప్రసాద్ మరణం నన్ను కలిచివేసింది. అతనికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్‌లో తెలిపారు. శివప్రసాద్ నటుడిగా ఖైదీతో వెండితెరకు పరిచయం అయ్యారు.



2095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles