బాహుబ‌లి2 రికార్డ్ బ్రేక్ చేసిన మెగాస్టార్ చిత్రం

Thu,April 4, 2019 10:02 AM
mohanlal lucifer breaks the record of baahubali 2

ఇటీవ‌లి కాలంలో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధిస్తున్నాయి. విభిన్నమైన కథలు, సరికొత్త క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌కి ఆయ‌న మంచి వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా మోహ‌న్ లాల్ .. పృథ్వీరాజ్ సుకుమార్ ద‌ర్శక‌త్వంలో లూసిఫర్ అనే చిత్రం చేశారు. ఆంటోనీ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్ లాల్ సరసన మంజూ వారియర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ న‌టించారు.. దీపక్ సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 28న విడుద‌లైన ఈ చిత్రం కేవ‌లం నాలుగు రోజుల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం కేర‌ళ‌లో 6 రోజులకి 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసింది. ఇంతకుముందు బాహుబలి 2 కేర‌ళ‌లో 7 రోజుల్లో 30కోట్లను రాబట్టింది. లూసిఫ‌ర్ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరు రోజుల‌కి గాను 78 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని సమాచారం. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన లూసిఫర్ వంద కోట్ల మార్కుని సులువుగా అందుకుంటుంద‌ని అంటున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలు .. పాత్రల్లోని కొత్తదనం .. వాటిని మలిచిన తీరు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయని భావిస్తున్నారు.

5854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles