భారీ ప్రాజెక్ట్ కోసం వ‌ర్క‌వుట్స్ చేస్తున్న మోహ‌న్ లాల్

Fri,February 15, 2019 12:06 PM

మాలీవుడ్‌లో దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న పీరియాడిక‌ల్ చిత్రం మ‌ర‌క్క‌ర్‌- అర‌బిక‌డ‌లింతే సింహం. మోహ‌న్ లాల్‌, సునీల్ శెట్టి, మంజు వారియర్, అర్జున్ సారా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన లొకేష‌న్ స్టిల్స్ , పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే మోహ‌న్ లాల్ ఈ మూవీలో కుంజ‌లీ మ‌ర‌క్క‌ర్ అనే పాత్ర‌ని పోషిస్తుండ‌గా,ఆ పాత్ర కోసం భారీ వ‌ర్క‌వుట్స్ చేస్తున్నాడు. ట్రైన‌ర్ స‌మ‌క్షంలో మోహ‌న్ లాల్ వర్కవుట్ చేస్తున్న ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 58 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో మోహన్ లాల్ వ‌ర్కవుట్స్ చేస్తుండ‌డం చూసిన అభిమానులు ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. చివ‌రిగా ఒడియ‌న్ అనే చిత్రంతో ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చిన మోహ‌న్ లాల్ ఇందులో విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేశాడు. ఆయ‌న క‌ప్పం అనే చిత్రంలోను న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఇదిలా ఉంటే మ‌ర‌క్క‌ర్‌- అర‌బిక‌డ‌లింతే సింహం చిత్రం ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ కూడా రూపొందించిన‌ట్టు స‌మాచారం.

1281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles