ఈ సారి బిగ్ బాస్ హోస్ట్‌గా మెగాస్టార్ !

Wed,September 18, 2019 12:44 PM

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం దేశంలోని ప్రాంతీయ భాష‌ల‌లో ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ముందుగా హిందీలో ఈ కార్య‌క్ర‌మం మొద‌లు కాగా, ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, కన్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల‌లోను బిగ్ బాస్ హంగామా న‌డుస్తుంది. హిందీలో ప‌దికి పైగా సీజ‌న్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో తెలుగు, త‌మిళంలో మూడో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. గ‌త ఏడాది మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హోస్ట్‌గా బిగ్ బాస్ సీజ‌న్ 1 కార్య‌క్ర‌మం ఏషియానెట్‌లో ప్ర‌సారం కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ సీజ‌న్ 2 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.


వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్ బిగ్ బాస్ షో కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. తొలి సీజ‌న్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేసిన ఆయ‌న రెండో సీజ‌న్‌ని కూడా అంతే జోష్‌తో న‌డిపించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. తాజాగా ఏషియా నెట్ సంస్థ త‌మ ఫేస్ బుక్ పేజ్ ద్వారా బిగ్ బాస్ సీజ‌న్ 2 కార్య‌క్ర‌మం అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుందని, దీనికి హోస్ట్‌గా మోహ‌న్ లాల్ ఉంటార‌ని తెలియ‌జేశారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న ఈ షోలో ఎంత మంది కంటెస్టెంట్స్ ఉంటారు, ఎప్పుడు ప్రారంభం కానుంద‌నే వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఇక్కడ ఓ విష‌యం గ‌మనిస్తే తెలుగులో మాత్ర‌మే బిగ్ బాస్ షోని హోస్ట్ చేసే వారు మారుతున్నారు. వేరే భాష‌ల‌లో మాత్రం ముందు హోస్ట్ చేసిన వారే ఉంటూ వ‌స్తున్నారు. త‌మిళంలో క‌మ‌ల్ బిగ్ బాస్ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగులో నాగ్ హోస్ట్‌గా ఉన్నారు.

2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles