2020లో విడుద‌ల కానున్న మోహ‌న్ లాల్ బయోగ్ర‌ఫీ

Tue,May 21, 2019 01:41 PM
Mohanlals Biography Is Progressing

భారతదేశం గర్వించదగ్గ నటులలో మోహన్ లాల్ ఒక‌రు. ఒక వైపు సొంత భాషలో కమర్షియల్ సినిమాలు చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలోని నటుడిని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగాడు. ఆ మధ్య ‘మనమంతా’, జనతా గ్యారేజ్’ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ మనుసులు దోచుకున్నాడు మోహ‌న్ లాల్ . జాతీయ స్థాయిలో ఐదు పుర‌స్కారాలు అందుకున్న మోహ‌న్ లాల్ ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డులు అందుకున్నారు. ది కంప్లీట్ యాక్ట‌ర్‌గా పిల‌వ‌బ‌డే మోహ‌న్ లాల్ బ‌ర్త్ డే నేడు. ఈ సంద‌ర్భంగా అత‌నికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. అయితే భాను ప్ర‌కాశ్ అనే ర‌చ‌యిత మోహ‌న్ లాల్ ప్రొఫెష‌న‌ల్ , పర్స‌న‌ల్‌తో పాటు మ‌రిన్ని కోణాల‌ని ముక్కార‌గం అనే పుస్త‌కం ద్వారా ఆవిష్క‌రించ‌నున్నాడు. ఈ విష‌యాన్ని మోహ‌న్ లాల్ త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపాడు. ప్ర‌స్తుతం మోహ‌న్ లాల్ బ‌యోగ్రఫీ బుక్‌కి సంబంధించి వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, 2020లో దీనిని ప్ర‌జ‌ల ముందుకు తీసుకురానున్నారు.

కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్న మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం ‘ఇట్టిమాని: మేడ్‌ ఇన్‌ చైనా’ అనే చిత్రం చేస్తున్నారు. జిబి అండ్‌ జోజు ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో పురాతన క్రిస్టియన్ నృత్యాల‌లో ఒకటైన ‘మార్‌క్కంగళి’ డ్యాన్స్‌ చేసే త్రిసూర్‌ ప్రాంత వాస్తవ్యుడిగా మోహన్‌లాల్ క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు సిద్ధిఖీ ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ బ్ర‌ద‌ర్ అనే సినిమా చేయ‌నున్నాడు మోహ‌న్ లాల్. ఇందులో స‌ల్మాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు.

860
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles