జ‌నాల‌ని ఫూల్స్ చేసిన భాగ‌మ‌తి న‌టి.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్

Fri,July 5, 2019 01:35 PM

భాగ‌మ‌తి చిత్రంలో పోలీస్ అధికారి పాత్ర‌లో న‌టించి అలరించిన న‌టి ఆశా శ‌ర‌త్. ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మ‌ల‌యాలంలో ఎవిడే అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ చిత్ర ప్ర‌చార భాగంలో ఓ వీడియోని షేర్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది ఆశా. త‌న భ‌ర్త క‌నిపించ‌డం లేద‌ని , ఎవరికైన అత‌ను క‌నిపిస్తే కేర‌ళ‌లోని క‌ట్ట‌ప్ప‌న పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌మ‌ని కోరింది. ఎంతో అమాయ‌కంగా తాను చెప్ప‌డంతో నెటిజ‌న్స్ అంద‌రు నిజ‌మే అని భావించారు. ఓ న్యాయ‌వాది పోలీస్ స్టేష‌న్‌లో కూడా ఫిర్యాదు చేశార‌ట‌. విష‌యం సీరియ‌స్ కావ‌డంతో ఇది సినిమా కోసం చేసిన ప్రచార వీడియో అని ఆశా తెలిపింది. ఈ నేప‌థ్యంలో అభిమానులని బ‌య‌పెట్టేలా చేసే ఇలాంటి ప్ర‌చారాలు మానుకోండ‌ని ఆమెకి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఫ్యాన్స్. గ‌తంలోను ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలానే జరిగాయి. ఓ పాప రోడ్ యాక్సిడెంట్‌లో గ‌తాన్ని మ‌రిచిపోయింద‌ని ఫేస్ బుక్ పేజ్‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చారు. ఆ పాపకి సాయం చేయాల‌నుకునే వారు కాల్ చేయ‌మ‌ని నెంబ‌ర్ కూడా ఇచ్చారు. ఇది మార్కెటింగ్ స్ట్రాట‌జీ అని తెలిసి ప్ర‌జ‌లు మండిప‌డ్డారు.


4177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles