‘విషు’ విషెస్ చెప్పిన స్టార్ సెలబ్రిటీస్

Fri,April 14, 2017 01:23 PM

ఈ రోజు విషు పండుగ. మలయాళీలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. సాధారణంగా మలయాళీల కొత్త సంవత్సరంను ‘విషు’ అని పిలుస్తారు . ఉగాది పండుగని మనం ఎలా జరుపుకుంటామో మలయాళీలు విషు వేడుకలను అలా జరుపుకుంటారు. హైదరాబాద్‌లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాత్రిపూట దేవాలయాలకు వెళ్లి, అక్కడే పడుకుని, తెల్లవారు జామున మూడు గంటలకు లేచి, కళ్లు మూసుకుని వచ్చి మొదట దేవునినే చూస్తారు. కొత్త ఏడాది మొదటి దర్శనం దేవుని రూపమే కావాలనేది ‘విషు’ పండుగలో ప్రత్యేకత. అలా దేవుడిని చూసే వేడుకను ‘విషుకని’ అంటారు.


హైదరాబాద్‌లోని చాలా దేవాలయాలలో కూడా మలయాళీల కోసం ప్రత్యేకంగా ‘విషుకని’ పూజలు నిర్వహిస్తారు . ముఖ్యంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని అయ్యప్ప దేవాలయంలో విషుకని పూజలు ఘనంగా నిర్వహిస్తారట. కొత్త బట్టలు, ఆభరణాలు ధరించి, పండ్లు, పూలు దేవుడికి సమర్పించి, వేకువ జామున మూడింటికల్లా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడంతో విషు వేడుకలు మొదలవుతాయట. పెద్ద సంఖ్యలో మలయాళీలు ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగని పురస్కరించుకొని మలయాళీ స్టార్స్ మోహన్ లాల్, మమ్ముట్టి, జయరాం, దిలీప్ , ఉన్ని కృష్ణన్ తదితరులు ఫేస్ బుక్ వేదికగా మలయాళీలకు విషు విషెస్ తెలియజేశారు.2264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles