పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న హీరోయిన్

Thu,September 19, 2019 08:42 AM

గోల్డ్‌, బ్ర‌హ్మ‌స్త్రా త‌దిత‌ర చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అందాల భామ మౌనిరాయ్. ఈ ముద్దుగుమ్మ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డింది. 11వ అంత‌స్తు నుండి పెద్ద బండ‌రాయి వ‌చ్చి మౌని రాయ్ కారుపై ప‌డింది. కాని ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎలాంటి హాని జ‌ర‌గ‌లేదు. కాక‌పోతే బాధ్య‌త‌రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డింది.


జూహు సిగ్నల్ నుంచి వెళ్తున్న నేను రెడ్ సిగ్నల్ పడడంతో నా కారును ఆపాను. అనుకోకుండా ఓ పెద్ద బండరాయి వ‌చ్చి నా కారుపై పడింది. అది 11 అంతస్తుల పై నుంచి పడడంతో కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. ఒకవేళ నా కారుపైన కాకుండా.. ఈ దారి వెంట వెళ్ళే ఎవరిపైనైనా పడుంటే పరిస్థితి ఏంటి? ముంబై మెట్రో పనులు ఎంత బాధ్యతారహిత్యంగా కొనసాగుతున్నాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ’’ అని మౌని రాయ్ త‌న ట్వీట్‌లో పేర్కొంది.2347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles