డేటింగ్ వార్తలను కొట్టిపారేసిన మౌనీరాయ్

Mon,October 14, 2019 03:10 PM


గోల్డ్, రా వంటి చిత్రాలతో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరింది మౌనీరాయ్. కన్నడ యాక్టర్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ -1 లో ప్రత్యేక గీతంలో తళుక్కున మెరిసింది. మౌనీ రాయ్ దుబాయ్‌కి చెందిన సూరజ్ నంబియార్‌తో కలిసి దిగిన ఫొటోను ఇటీవల ఆమె స్నేహితురాలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సూరజ్ నంబియార్‌తో మౌనీ రాయ్ డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ డేటింగ్ వార్తలను మౌనీ కొట్టిపారేసింది. డేటింగ్ వార్తలు నిజం కాదు. మేమంతా స్నేహితులం. నా పుట్టినరోజున అందరం కలిశాం. నేను సింగిల్‌గానే ఉన్నా. కేవలం నా పనిపై మాత్రమే శ్రద్ద పెడుతున్నా. డేటింగ్ వార్తలు చూసి అస్వస్థతకు లోనయ్యా. దయచేసి పుకార్లకు పుల్ స్టాప్ పెట్టాలని కోరింది.

1441
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles