బాలీవుడ్ విశ్లేష‌కులపై ఫైర్ అవుతున్న మూవీ ల‌వ‌ర్స్

Thu,September 5, 2019 12:53 PM

ప్ర‌భాస్‌, సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన బిగ్గెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ సాహో. ఈ చిత్రం దాదాపు 350 కోట్లకి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికి భారీ వ‌సూళ్ళు సాధించ‌డం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఇక బాలీవుడ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించి వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయిన‌ప్ప‌టికి బాలీవుడ్ విశ్లేష‌కులు సాహో సినిమాని త‌గ్గించి ట్వీట్స్ చేయ‌డం సినిమా ల‌వ‌ర్స్‌కి ప‌ట్ట‌లేని కోపాని తెప్పిస్తుంది. తప్పుడు స‌మాచారంతో వారు ప్రేక్ష‌కుల‌ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వారు మండి ప‌డుతున్నారు. సౌత్ సినిమాల‌పై వారు చూపిస్తున్నఈ వైఖ‌రి ఏం బాగోలేదంటూ నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా త‌ర‌ణ్ ఆద‌ర్శ్ సాహో సినిమా రిలీజ్ అయిన రోజు.. ఈ చిత్రం భ‌రించ‌లేని సినిమా అని చెబుతూ, ప్రేక్ష‌కులు ఈ సినిమాపై పెద‌వి విరుస్తున్నార‌ని చెప్పుకొచ్చాడు. అంతేకాదు క‌లెక్ష‌న్స్ విష‌యంలోను ఆయ‌న త‌ప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ వారు మండిప‌డుతున్నారు.


3623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles