జెర్సీ రీమేక్‌లో క‌థానాయికగా హృతిక్ భామ‌

Tue,November 19, 2019 10:47 AM

బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ తెలుగులో మంచి విజ‌యం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం హిందీలోను మంచి విజ‌యం సాధించింది. ఇప్పుడు నాని న‌టించిన‌ జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు షాహిద్. జెర్సీ చిత్రం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌గా, ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. కుటుంబ అనుబంధాలు, తండ్రీకొడుకుల అనురాగానికి క్రికెట్ నేపథ్యాన్ని మేళవించి భావోద్వేగభరితంగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అర్జున్ పాత్ర‌లో నాని చ‌క్క‌ని న‌ట ప్ర‌తిభ‌ని క‌న‌బ‌రిచాడు. తన లక్ష్యానికి, ఉద్యోగానికి దూరమై కుటుంబ బాధ్యతలతో అర్జున్ సతమతమయ్యే సన్నివేశాలతో ప్రథమార్థాన్ని ఎమోషనల్‌గా నడిపించారు దర్శకుడు.


జెర్సీ చిత్రాన్ని హిందీలోను గౌత‌మ్ తిన్న‌నూరి తెర‌కెక్కించ‌నుండ‌గా, ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ ఈ నిర్మాణంలో భాగస్వామం కానున్నారు. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, చిత్రాన్ని 2020 ఆగష్టు 28వ తేదీన విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్రంలో క‌థానాయిక‌గా మృణాల్ ఠాకూర్‌ని ఎంపిక చేశారు. ఈ అమ్మ‌డు సూప‌ర్ 30 చిత్రంలో హృతిక్‌తో జోడీ కట్ట‌గా, బ‌త్లా హౌజ్‌లో జాన్ అబ్ర‌హం స‌ర‌స‌న న‌టించింది. తాజాగా షాహిద్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం రావ‌డంతో మృణాల్ ఆనందానికి అవ‌ధులు లేవు. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది.


980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles