మల్టీస్టారర్ మూవీకి టైటిల్ ఫిక్స్..!

Wed,November 2, 2016 11:46 AM

మెగా హీరో సాయిధరమ్ తేజ్, నందమూరి హీరో కళ్యాణ్ రామ్ లు కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి తెరకెక్కించనున్నట్టు ప్రచారం జరిగింది. కె.ఎస్. రామారావు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘రామకృష్ణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు గతంలో కొన్ని సామాజిక మాధ్యమాలు ప్రచురించాయి. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన త్రిష నటించనుండగా, సాయిధరమ్ సరసన రెజీనా హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందట. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో టైటిల్ వార్తల్లోకి వచ్చింది. కె.ఎస్.రవికుమార్ తాజాగా ‘స్టార్’ అనే టైటిల్ ని ఫిల్మ్‌చాంబర్‌లో రిజిస్టర్ చేయించగా, ఈ టైటిల్ ని కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ మూవీకి పెట్టొచ్చనే టాక్ నడుస్తోంది. మరి ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

2307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles