HomeLATEST NEWSmulti starrer movie launch date fixed

నెగెటివ్ పాత్ర‌లో నాని.. రేపు లాంచ్ కానున్న మ‌ల్టీ స్టారర్

Published: Sun,April 28, 2019 12:52 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శక‌త్వంలో నాని, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓ మల్టీ స్టార‌ర్ తెర‌కెక్కుతుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంకి సంబంధించి కొద్ది రోజులుగా ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. చిత్రంలో నాని పాత్ర కొద్ది సేప‌టికే ఉన్న‌ప్ప‌టికి చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ట‌. ఈ చిత్రంతో నాని తొలిసారి నెగెటివ్ పాత్ర చేయ‌బోతున్నాడు అని అన్నారు. రేపు( ఏప్రిల్ 29) ఈ చిత్ర టైటిల్ లోగో రిలీజ్ చేయ‌డంతో పాటు పూజా కార్య‌క్ర‌మాలు జ‌ర‌పనున్నారని స‌మాచారం. డిసెంబర్ చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో నాని సరసన నాయికగా అదితీ రావ్ హైదరీని .. సుధీర్ బాబు జోడీగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి వి అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని తెలిసింది. వి మతలబు ఏంటనేది సినిమా చూస్తేనే అర్థమవుతుందని, కథానుగుణంగానే ఆ టైటిల్‌ను పెట్టబోతున్నారని సమాచారం. గతంలో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని అష్టాచమ్మా, జెంటిల్‌మన్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు మూడోసారి కలిసి సినిమా చేయబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్‌కుమార్ దర్శకుడు.
2862
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology