28వ గ్రామీ అవార్డు గెలిచిన క్విన్సీ జోన్స్‌..

Mon,February 11, 2019 02:56 PM
Music composer Quincy Jones wins his 28th grammy award

హైద‌రాబాద్: అమెరికా మ్యూజిక్ డైర‌క్ట‌ర్ క్విన్సీ జోన్స్‌.. గ్రామీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం లిఖించాడు. మ్యూజిక్‌ కెరీర్‌లో అత‌ను 28వ సారి గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఏడాది కూడా అత‌ను త‌న ఖాతాలో ఓ అవార్డును వేసుకున్నాడు. బెస్ట్ మ్యూజిక్ ఫిల్మ్ క్యాట‌గిరీలో ఈ సారి అత‌ను అవార్డును గెలుచుకున్నాడు. 85 ఏళ్ల లెజండ‌రీ మ్యూజిక్ మాస్ట‌ర్ క్విన్సీ జోన్స్‌.. ఎక్కువ సంఖ్య‌లో గ్రామీలు అందుకున్న మొద‌టి పాప్‌స్టార్‌గా నిలిచాడు. క్విన్సీ గ‌తంలో మైఖేల్ జాక్స‌న్‌తోనూ ప‌నిచేశాడు. 70 ఏళ్ల కెరీర్‌లో అత‌ను ప‌ది క్యాట‌గిరీల్లో గ్రామీ గెలిచాడు. క్విన్స్ గ్రామీ అందుకున్న ఫోటోను ఏఆర్ రెహ్మాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సంగీతం ఎప్పుడూ మ‌న‌ల్ని ముందుకు న‌డిపిస్తుంద‌ని భావిస్తాననుకుంటాను అని రెహ్మాన్ ఆ ఫోటోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

1212
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles