మీడియా ముందు త‌న బాధ‌ని వెళ్ళ‌గ‌క్కిన హృతిక్ సోద‌రి

Thu,June 20, 2019 12:53 PM

హృతిక్ సోద‌రి సునైన ఓ ముస్లిం వ్య‌క్తిని ప్రేమించిన కార‌ణంగా వారి ఫ్యామిలీ ఆమెని శారీరికంగా, మాన‌సికంగా హింసిస్తున్నార‌ని, త‌నకి సాయం కావాల‌ని సునైన ఇటీవ‌ల కంగ‌నాని కోరిందంటూ రంగోలి త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సునైన డైరెక్ట్‌గా మీడియా ముందుకు వ‌చ్చి త‌న బాధ‌ని వెళ్ళ‌బోసుకుంది . ఢిల్లీకి చెందిన ముస్లిం వ్య‌క్తి గ‌త ఏడాది ప‌రిచ‌య‌మ‌య్యాడు. అత‌నంటే నాకు ఎంతో ఇష్టం. ఇంట్లో వాళ్ళు ఆయ‌న‌ని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవ‌డం లేదు. న‌రకం చూపిస్తున్నారు. బ‌య‌ట‌కి రానివ్వ‌డం లేదు.ఉగ్రవాదిని ప్రేమించానంటూ హింసిస్తున్నారు. ప్రేమించిన వ్య‌క్తితో సంతోషంగా ఉండాల‌ని నాకుంది. కాని ముస్లిం అనే కార‌ణంగా మా పెళ్లికి ఒప్పుకోవ‌డం లేదు అంటూ సునైన ఆవేద‌న వ్య‌క్తం చేసింది.


హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుసాన్నే కూడా ఈ వివాదం పై స్పందించింది. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టిన సుసాన్నే అందులో .. నాకు ఆ ఫ్యామిలీతో చాలా కాలం అనుబంధం ఉంది కాబ‌ట్టి చెబుతున్నాను. సునైనా నాకు తెలిసి చాలా మంచిది. ప్ర‌స్తుతం ఆమె చాలా విపత్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. హృతిక్ తండ్రి రాకేష్ రోష‌న్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. త‌ల్లికి ఏం మాట్లాడాలో తెలియ‌క స‌త‌మ‌త‌మవుతున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ప్రతి ఒక్క‌రి ఫ్యామిలీలో జ‌రుగుతుంటాయి. ద‌యచేసి వారి ఫ్యామిలీని గౌరవించండి అని సుసాన్నే పేర్కొంది. సునైన వివాదం రోజు రోజుకి ముదురుతుండ‌గా హృతిక్ కాని వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ కాని ఇంకా స్పందించ‌క‌పోవ‌డం విశేషం.

3439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles