మైత్రి మూవీ మేక‌ర్స్ నుండి కాస్టింగ్ కాల్

Sat,May 4, 2019 08:24 AM
Mythri Movie Makers Casting Call

న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి నిర్మించిన సంస్థ‌ మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌. విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ వెళుతున్న వీరిని వ‌రుస విజ‌యాలు ప‌ల‌క‌రిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌పై రూపొందిన శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్ , రంగ‌స్థ‌లం, చిత్ర‌ల‌హ‌రి చిత్రాలు ఎంత పెద్ద విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ బేన‌ర్‌లో డియ‌ర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడ‌ర్, వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ చిత్రం,అల్లు అర్జున్ 20వ చిత్రం రూపొందుతున్నాయి. తాజాగా ఈ సంస్థ కాస్టింగ్ కాల్ ఇచ్చింది. 9 నుండి 11 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలు మేక‌ప్ లేకుండా త‌మ ఫోటోల‌ని వాట్సాప్ చేయాల‌ని కోరింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం. సినిమాలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న బాలిక‌లు వెంట‌నే త‌మ ఫోటోల‌ని పంపి ల‌క్కీ ఛాన్స్ కొట్టేయండి.

2054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles