పుకార్లను కొట్టిపారేసిన మైత్రి మూవీ మేకర్స్

Wed,March 16, 2016 10:48 PM
mythri movie makers reacts on Gossips


హైదరాబాద్: జనతా గ్యారేజీ సినిమా షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారంటూ వచ్చిన వార్తలను చిత్ర నిర్మాతలు తోసిపుచ్చారు. సినిమా షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు ఎలాంటి ప్రమాదం జరుగలేదని..అభిమానులు ఆందోళనచెందవద్దని మైత్రీమూవీ మేకర్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. జనతా గ్యారేజీ పేరుతో ఎటువంటి అఫీషియల్ పేజీ లేదని.. ఏ వార్తలైనా @mythriofficial పేజీ ద్వారానే వస్తాయని వెల్లడించింది.

ఎన్టీఆర్ గాయపడ్డారంటూ జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ అఫీషియల్ పేజిలో పోస్ట్ కావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలయింది. కొద్దిసేపటి తర్వాత ఆ అకౌంట్ ఇన్ యాక్టివ్ అవడంతో అభిమానుల్లో కాస్త గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే.

2468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles