ఓ బేబి చిత్రం నుండి 'నాలో మైమ‌ర‌పు' వీడియో సాంగ్ విడుద‌ల‌

Sun,August 4, 2019 10:11 AM
Naalo Maimarapu Full Video Song released

క‌థల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకుంటున్న స‌మంత తాజాగా న‌టించిన చిత్రం ఓ బేబి . కొరియన్ చిత్రం మిస్‌గ్రానీకి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. త‌ను పోషించిన పాత్ర‌లో స‌మంత‌ని త‌ప్ప మ‌రొకరిని ఊహించుకోలేనంత గొప్పగా సమంత అద్భుతాభినయాన్ని ప్రదర్శించింది. వృద్ధురాలైన బేబీ పాత్రలో లక్ష్మి పరకాయప్రవేశం చేసింది. రావు రమేష్, రాజేంద్రప్రసాద్ తమ పాత్రలకు పరిపూర్ణంగా న్యాయం చేశారు. ప్రథమార్థంలో సమంత, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాల్లో చక్కటి వినోదం పండింది. పతాకఘట్టాల్లో సమంత, రావురమేష్ మధ్య సీన్స్ హార్ట్‌టచింగ్‌గా సాగాయి. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక విదేశాల‌లోను ఈ చిత్రానికి మంచి వ‌సూళ్ళు వ‌స్తున్నాయి. తాజాగా చిత్రం నుండి నాలో మైమ‌ర‌పు అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు.

705
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles