ఇట్స్ టైమ్ ఫ‌ర్ నభా నటేష్

Thu,August 8, 2019 08:59 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్రం టీంతో పాయ‌ల్ రాజ్‌పుత్ క‌ల‌వ‌గా, రీసెంట్‌గా న‌భా నటేష్ జాయిన్ అయింది. ర‌వితేజతో క‌లిసి న‌భాన‌టేష్ దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమ‌వుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. ప్ర‌స్తుతం మూవీ చిత్రీక‌ర‌ణ సింగ‌పూర్‌లో జ‌రుగుతుంది. ఈ చిత్రంలో సునీల్, రామ్‌కీ, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఏడాదే డిస్కో రాజా చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

1528
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles