హిట్ సాంగ్ రీమిక్స్‌కు ప్లాన్..

Thu,April 12, 2018 05:15 PM


హైదరాబాద్ : టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య తాజాగా సవ్యసాచి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. నాగార్జున నటించిన అల్లరి అల్లుడు చిత్రంలో నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిట్టు సాంగ్ ఏ రేంజ్‌లో ఫేమస్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇపుడు ఈ సాంగ్ ను సవ్యసాచి సినిమాలో రీమిక్స్ చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఒరిజనల్ సాంగ్‌కు బాణీలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ పాటను కూడా కంపోజ్ చేస్తారట. ఇక ఈ పాటలో టాప్ హీరోయిన్ చైతూతో కలిసి డ్యాన్స్ చేయనున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుదిదశలో ఉంది. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

2958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles