చైతూ 'స‌వ్య‌సాచి' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది

Fri,March 16, 2018 10:56 AM

నాగ చైత‌న్య‌- చందూ మొండేటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం స‌వ్య‌సాచి. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో చైతూ సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న వెనుక ప‌లు చేతులు డిఫ‌రెంట్ టాటూస్‌తో కనిపిస్తున్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. ఈ చిత్రంలో చైతూ త‌న రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా వాడి ప‌రిస్థితుల‌ని, ప్ర‌త్య‌ర్ధుల‌ని ఎదుర్కొంటాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్రలు పోషించారు. జూన్ 14న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కీర‌వాణి సంగీతం అందిస్తున్న‌ ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ మూవీతో పాటుగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో శైల‌జా రెడ్డి అల్లుడు అనే చిత్రం చేస్తున్నాడు చైతూ. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న స‌తీమ‌ణితో క‌లిసి త్వ‌ర‌లో ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు చైతూ. వీటి త‌ర్వాత డెబ్యూ డైరెక్ట‌ర్‌తోను ఓ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. ఇది అన్న‌పూర్ణ స్టూడియో బేన‌ర్‌పై రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది.




2171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles