మ‌రోసారి వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్న చైతూ- సామ్ జంట‌..!

Sun,June 16, 2019 11:17 AM

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం సీక్వెల్స్‌పై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌న్మ‌థుడు చిత్రానికి సీక్వెల్‌గా మ‌న్మ‌థుడు 2 చిత్రం చేస్తున్న నాగ్ ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత మూడేళ్ల క్రితం నాగార్జున హీరోగా..కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా చేయ‌నున్నాడు నాగ్. ఈ సినిమా ఆగ‌స్ట్ నుండి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. ఇందులో నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తుండగా, ఆయ‌న‌కి తాత‌గా నాగ్ కనిపించ‌నున్నాడ‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య వచ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందిస్తాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే చైతూ- నాగ్ క‌లిసి మనం సినిమాలో నటించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది.

బంగార్రాజు చిత్రంలో నాగ్ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, చైతూకి జోడీగా ఏ హీరోయిన్‌ని ఎంపిక చేయ‌లేదు. ప్ర‌స్తుతం వ‌రుస స‌క్సెస్‌ల‌తో దూసుకెళుతున్న స‌మంత .. చైతూతో జోడి క‌డితే చిత్రానికి ఫుల్ క్రేజ్ వ‌స్తుంద‌ని యూనిట్ భావిస్తుంద‌ట‌. ఇప్ప‌టికే స‌మంత, చైతూ, నాగ్‌లు మ‌నం చిత్రంలో న‌టించ‌గా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఇక చైతూ- సామ్ న‌టించిన ఏ మాయ చేశావే, మ‌నం, మ‌జిలీ చిత్రాలు కూడా మంచి విజ‌యం సాధించాయి. ఈ లెక్క‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే బంగార్రాజు కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్న టీం స‌మంత‌నే ఫైన‌ల్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

2842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles