సుశాంత్ మూవీని రీమేక్ చేయ‌నున్న చైతూ..!

Sun,November 17, 2019 09:23 AM

అక్కినేని నాగ చైత‌న్య ప్ర‌స్తుతం వెంకీ మామ చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ ల‌వ్ స్టోరీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ ఓ సినిమా చేయ‌నున్న‌ట్టు ప్రచారం జ‌ర‌గుతుంది. క‌ట్ చేస్తే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం చిచ్చోరే చిత్రాన్ని నాగ‌చైత‌న్య రీమేక్ చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. అతి త్వ‌ర‌లోనే చైతూ ఈ సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. గీతా గోవిందం ఫేం ప‌ర‌శురాం ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడ‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీనిపై ఓ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని చెబుతున్నారు.

1551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles