చైతూతో మ‌రోసారి న‌టించనున్న మాధ‌వ‌న్

Sun,June 3, 2018 06:56 AM

తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేయ‌క‌పోయిన డ‌బ్బింగ్ సినిమాల‌తో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి మాధ‌వ‌న్ చాలా సుప‌రిచితం. ఈయ‌న‌కి తెలుగులో లెక్క‌లేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే త్వ‌ర‌లో ఓ స్ట్రైట్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు మాధ‌వ‌న్‌. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రంలో మాధ‌వ‌న్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషించాడు. ఈ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని టీం చెబుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే నాగ‌చైత‌న్య‌, మాధ‌వ‌న్ క‌లిసి మరో సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాలీవుడ్‌లో ఓ వార్త చక్క‌ర్లు కొడుతుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత‌, చైతూ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న సినిమా కోసం మాధ‌వ‌న్‌ని కీల‌క పాత్ర కోసం తీసుకోవాల‌ని టీం భావిస్తుంద‌ట‌. దీనికి సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించనున్నారు. మ‌రోవైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చైతూ శైల‌జా రెడ్డి అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

3054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles