న్యూయార్క్ షూట్‌లో చైతూ టీం

Mon,May 7, 2018 05:16 PM


హైదరాబాద్ : యుద్ధం శరణం సినిమా తర్వాత నాగచైతన్య నటిస్తోన్న తాజా చిత్రం సవ్యసాచి. ప్రేమమ్ డైరెక్టర్ చందూమొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నది. నిధి అగర్వాల్ చైతూకు జోడీగా నటిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూట్‌లో భాగంగా చైతూ అండ్ టీం న్యూయార్క్‌కు వెళ్లింది. ఓ పాటతోపాటు టాకీపార్ట్ చివరి షెడ్యూల్‌లో షూట్ చేయనున్నారు. న్యూయార్క్ షూటింగ్ లొకేషన్‌లో వెన్నెల కిశోర్, కమెడియన్ శంకర్, చందూమొండేటి, చైతూ, నిధి దిగిన ఫొటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూమిక నాగచైతన్యకు సోదరిగా నటించనున్నట్లు టాక్. మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సవ్యసాచి ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.
1950
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles