బాలీవుడ్ మూవీ రీమేక్ ఆలోచ‌న‌లో నాగ్..!

Wed,October 16, 2019 08:47 AM

ఇటీవ‌ల మ‌న్మ‌థుడు 2 చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాగార్జున అతి త్వ‌ర‌లో త‌న త‌ర్వాతి ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఏమై ఉంటుంద‌నే దానిపై సస్పెన్స్ నెల‌కొని ఉంది. మొన్న‌టి వ‌ర‌కు సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రానికి ప్రీక్వెల్‌గా బంగార్రాజు తీస్తాడ‌ని ప్రచారం జ‌రుగ‌గా, తాజాగా బాలీవుడ్ చిత్ర రీమేక్ చేయ‌బోతున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.


2018లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఇలియానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వ‌చ్చిన రైడ్ చిత్రం మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రాజ్ కుమార్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట నాగ్. ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ రీమేక్ గురించి నాగ్‌తో ప‌లు చర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంద‌ని అంటున్నారు. నాగార్జున ప్ర‌స్తుతం బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మంతో బిజీగా ఉండ‌గా, మ‌రో మూడు వారాల‌లో దీనికి ఎండ్ కార్డ్ ప‌డనుంది.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles