బిగ్ బాస్ స్టేజ్‌పై యాంక‌ర్ ర‌వి..షాక్‌లో ఇంటి స‌భ్యులు

Sun,October 20, 2019 08:09 AM

శనివారం వ‌చ్చిందంటే నాగార్జున‌తో ఇంటి స‌భ్యులు చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. అయితే తొలిసారి హౌజ్ మేట్స్ అంతా నామినేష‌న్‌లోకి వెళ్ల‌డంతో అంద‌రిలో ఓ ర‌క‌మైన భ‌యం నెల‌కొంది. ఆ భ‌యాన్ని పోగొట్టేందుకు నాగార్జున హౌజ్‌మేట్స్ ఇంటి స‌భ్యుల‌ని పిలిపించి స‌డెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక కంటెస్టెంట్స్‌తో నంబ‌ర్ గేమ్ కూడా ఆడించారు. ఈ గేమ్‌లో ఎవరి స్థానం ఏంట‌నేది వారే డిసైడ్ చేసుకొని బ్యాడ్జ్ త‌గిలించుకున్నారు. వారు సెల‌క్ట్ చేసుకున్న నెంబ‌ర్ ఆ కంటెస్టెంట్‌కి ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అనేది ఆడియ‌న్స్ తెలియ‌జేశారు.


అనంత‌రం బిగ్ బాస్ హౌజ్ స్టేజ్‌పైకి కంటెస్టెంట్స్ ఇంటి స‌భ్యులు, ఫ్రెండ్స్‌ని పిలిపించి ఉన్న ఏడుగురిలో ఏ ఐదుగురు ఫైన‌ల్‌కి వెళ‌తారు, ఏ ఇద్ద‌రు బిగ్ బాస్ హౌజ్‌ని వీడ‌నున్నారు అనేది చెప్పాల‌ని కోరారు నాగార్జున‌. అంతేకాదు కుటుంబ స‌భ్యులు తెచ్చిన గిఫ్ట్‌తో పాటు ఉన్న ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్‌ని ఓపేన్ చేయాల‌ని చెప్పారు. క‌వ‌ర్‌లో స్మైలీ ఉంటే వారు సేవ్ కాన‌ట్టు అని తెలియ‌జేశారు నాగ్. ముందుగా వ‌రుణ్ చెల్లెలు పూజా బిగ్ బాస్ స్టేజ్‌పైకి రాగా.. శివ‌జ్యోతి, అలీ ఫైన‌ల్‌కి వెళ్లే అర్హ‌త లేద‌ని చెప్పుకొచ్చింది. ఇక చెల్లి తెచ్చిన గిఫ్ట్‌ని చూసి సంతోషించిన వ‌రుణ్ త‌న‌కి వ‌చ్చిన ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్‌లో స్మైలీ ఉండ‌డంతో సేవ్ కాలేక‌పోయాడు.

శ్రీముఖి తండ్రి రామ‌కృష్ణ చాలా స్టైలిష్‌గా బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇవ్వ‌గా, కూతురితో స‌ర‌దాగా మాట్లాడారు. ఆయ‌న తెచ్చిన టెడ్డీబేర్ గిఫ్ట్‌తో పాటు ఎన్వ‌ల‌ప్ క‌వ‌ర్‌ని రాహుల్ చేతుల మీదుగా ఓపెన్ చేయించింది శ్రీముఖి. తండ్రి తెచ్చిన టెడ్డీబేర్‌ని గిఫ్ట్‌గా అందుకున్న శ్రీముఖి త‌ను ఈ వారం నామినేష‌న్స్ నుండి సేవ్ అయింది. ఆ త‌ర్వాత వితికా త‌ల్లి స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. కూతురుని చూసి క‌న్నీరు పెట్టుకుంది. గేమ్ బాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కి వ‌చ్చాక మీ అంద‌రికి భీమ‌వ‌రం వంట వండి పెడ‌తా అని వితికా త‌ల్లి చెప్పుకొచ్చారు. అయితే త‌ల్లి తెచ్చిన గిఫ్ట్‌లో స్మైలీ ఉండ‌డంతో వితికా నామినేష‌న్ నుండి సేవ్ కాలేక‌పోయింది.

శివ‌జ్యోతి సిస్ట‌ర్ బిగ్ బాస్ స్టేజ్‌పైకి రాగా, ఆమె నాగ్‌ని చూసి ఫుల్ ఇంప్రెస్ అయింది.మీ కోసమే ఇక్క‌డికి వ‌చ్చానంటూ మెలికలు తిరిగింది. ఆమె తెచ్చిన గిఫ్ట్‌లోను స్మైలీ రావ‌డంతో శివ‌జ్యోతి కూడా సేవ్ కాలేక‌పోయింది. ఇక అలీ జిగిరీ దోస్త్ యాంకర్ రవి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి సందడి చేశాడు. అలీ నీకు బ‌య‌ట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. ప‌క్కా నువ్వే విన్ అవుతావు అని అలీకి ధైర్యం చెప్పాడు. ఇక శ్రీముఖిని షోస్‌లో మిస్ అవుతున్నావంటూ పంచ్ పేల్చాడు రవి.అయితే త‌న ఫ్రెండ్ కోసం తెచ్చిన గిఫ్ట్‌లో స్మైలీ రావ‌డంతో అలీని సేవ్ చేయ‌లేకపోయాడు ర‌వి.


రాహుల్ కోసం సింగ‌ర్ నోయ‌ల్ వచ్చాడు. ఇద్ద‌రు పాట‌లు పాడుతూ కొద్దిసేపు ర‌చ్చ చేశారు. త‌ప్ప‌క టైటిల్ సాధిస్తావు అని రాహుల్‌ని ఎంకరేజ్ చేశాడు. ఆ త‌ర్వాత తాబేలు కుందేలు క‌థ చెప్పాడు. తాబేలులా నువ్వు త‌ప్ప‌క విజ‌యం సాధిస్తావు అని నోయ‌ల్ అన్నాడు. అయితే కుందేలు ఈ మ‌ధ్య‌నే బ‌య‌ట‌కి వ‌చ్చేసింద‌ని పున‌ర్న‌విని ఉద్దేశించి అన్నాడు నాగార్జున‌. ఇక నోయ‌ల్ తెచ్చిన గిఫ్ట్‌లో రాహుల్ పేరు ఉండ‌డంతో ఆయ‌న సేవ్ అయ్యాడు. ఇక బాబా భాస్కర్ అక్క వచ్చి గిఫ్ట్ ఇచ్చి తమ్ముడ్ని నామినేషన్ నుండి సేవ్ చేయగలిగింది. ఆమె తెచ్చిన గిఫ్ట్‌లో బాబా పేరు ఉండటంతో ఈవారం నామినేషన్ నుండి సేవ్ అయ్యారు బాబా భాస్కర్.

హౌజ్‌మేట్స్ ఇంటి స‌భ్యులు అంద‌రు దాదాపు వితికా, అలీ రెజాల‌కి ఆరు, ఏడు స్థానాలు ఇవ్వ‌డం విశేషం. మొత్తానికి ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న ఏడుగురిలో రాహుల్‌,శ్రీముఖి, బాబా భాస్క‌ర్ సేవ్ కాగా మిగ‌తా న‌లుగురిలో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు. మ‌రి ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఎవ‌రో తెలియాలంటే కొద్ది గంట‌లు ఆగాల్సిందే

4374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles