షాకింగ్ లుక్‌లో న‌మిత‌.. ఫోటోలు వైర‌ల్

Sun,September 8, 2019 09:51 AM

‘సొంతం’ చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన అందాల భామ‌ నమిత. ఇటు తెలుగు అటు త‌మిళ సినిమాల‌లో న‌టిస్తూ యూత్ మ‌న‌సులు గెలుచుకుంది. ఆమె కోసం త‌మిళ‌నాడులో గుడి కూడా క‌ట్టారంటే న‌మితకున్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవ‌చ్చు. వెంకటేష్ హీరోగా నటించిన జెమినీ చిత్రంలోను న‌టించిన న‌మిత‌ చివ‌రిగా సింహా చిత్రంలో బాల‌య్య‌తో ఆడిపాడింది. అయితే మియా అనే త‌మిళ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో వీరేంద్ర‌, న‌మిత‌ల మ‌ధ్య పుట్టిన ప్రేమ పెళ్లిగా మారింది. తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో వేదమంత్రాల సాక్షిగా న‌వంబ‌ర్ 24,2018న వీరేంద్రని వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్న న‌మిత త‌న ఫిజిక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. డైట్ మెయింటైన్ చేస్తూ ప‌లు వ‌ర్కవుట్స్‌తో స్లిమ్‌గా మారే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా న‌మిత‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో ప‌లు ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అవి ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. న‌మిత బాల‌య్య తాజా చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌నుంద‌నే ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

4142
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles